నీరు లేకుంటే జీవనమే ప్రశ్నార్థకం

నీరు లేకుంటే జీవనమే ప్రశ్నార్థకం
  • మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి మంచినీరు
  • కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులన్నీ మత్తడి దునుకుతున్నవి
  • రైతులకు కరెంట్ బిల్లు, నీటి పన్ను, భూమిశిస్తూ  లేదు: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: నీరే జీవాధారం నీరు లేకుంటే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా  మారుతుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం లోని ఎలగందల్ ఫిల్టర్ బెడ్ వద్ద నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నీళ్ల కోసం అరిగోస పడ్డామని, గోదావరి ప్రక్కనుండి పోయేదని కానీ తెలంగాణలో నీళ్లు దొరికేవి కాదని బావులు, బోర్లు ఎండిపోయే వని, నీళ్ల కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి బిందె మీద బిందె పెట్టుకొని నీళ్లు తీసుకొని వచ్చే వారని నీళ్లు లేక, కరెంటు లేక ప్రజలు అరిగోస పడ్డారని అన్నారు.  ఎక్కడా చూసిన నెర్రలు బారిన చెరువులు, ఎండిపోయిన బావులు, నీటికోసం కిలోమిటర్ల కోద్ది దూరంపోయి నీళ్లను బిందేలలో ఎత్తుకొని వచ్చే పరీస్థితులు తెలంగాణాలో సాక్షత్కరించేవని అన్నారు.  

వర్షాకాలంలో కూడా అల్లంతదూరానా మానేరులో కనిపించే నీళ్లు,  పంటపోలాలకు నీళ్లుపేట్టాలంటే లోఫేస్ కరెంటుతో నిత్యం కాళిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లే కనిపించేవని, పంటకు నీరు అందించలేక ఎండిపోతున్న పంటను పశువులకు గ్రాసంగా అదించిన రోజులను చూశామన్నారు. తెలంగాణను ఆనుకొని గోదావరి ప్రవహిస్తున్న,  సింగరేణి బోగ్గు గనులు నిక్షేపంగా ఉన్న వాటిని  ఏమాత్రం తెలంగాణా రాష్ట్ర అభివృద్దికి ఏమాత్రం వినియోగించబడలేదని గుర్తుచేశారు.  తెలంగాణ రాష్ట్రంలోని మంచి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేలా 2015 లో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని,  అదే విధంగా ప్రధాన రిజర్వాయర్లలోని 19 నీటిని తోడే బావులు, 50 మంచినీటిని శుద్దిచేసే కేంద్రాలు, 2983 నీటిని తోడే పంపులు మరియు 56 వేల కిలో మీటర్ల ప్రధాన పైపులైన్లు ప్రధాన ట్యాంకులను నిర్మించుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, మున్సిపాలిటీలలో 135 లీటర్లు, కార్పోరేషన్ల పరిదిలో150 లీటర్ల నీటిని ప్రతిఒక్కరికి అందించుకోవడం జరుగుతుందన్నారు.  

తెలంగాణ ఆవిర్బావాని పూర్వం 17 వెల నీటి ట్యాంకులు, 10 వేల కి.మీ. అంతర్గత పైపులైన్లు మాత్రమే నిర్మిస్తే,  మిషన్ భగీరథ పథకం ద్వారా 18,560 నీటి ట్యాంకులు, 67 వేల కి.మి. అంతర్గత పైపులైన్లను మరియు 57 లక్షల నల్లా కనెక్షన్లను నిర్మించుకొని, ఇటింటికి నీరందించుకోవడంతో 2022 లో నిత్య నీటి సరఫరాల చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవార్డ్ ను గెలుచుకొందన్నారు. గతంలో పంటను సాగుకు ముందు రైతు బ్యాంకుదగ్గర అప్పుతీసుకువస్తే, సరైన నీరు లేక ఆరైతు అప్పును తీర్చపోవడంతో అప్పుకు అప్పుపెరిగి వడ్డికూడా కట్టలేని పరీస్థితులు ఎదురైతే, ఆప్పులు ఇచ్చిన బ్యాంకులు మాత్రం ఆరైతు ఇంటి తలుపులు గుంజుకుపోవడం వంటివి చూసామని, అప్పుల పాలై రైతు ఆత్మహత్మ చేసుకుంటే అయ్యే అని అనుకున్నామే తప్ప ఎటువంటి సహాయాన్ని ఎవరు అందించలేదన్నారు.  

ఇంటి ఆడబిడ్డ పెళ్లి బారమై అయినవాళ్లు,  కానివాళ్ల దగ్గర అప్పులు తెచ్చి ఆస్థులు కుదువపెట్టే రోజులు కనిపించేవని,  చదువుకోవాలన్న ఆర్థిక పరీస్థితులు సహకరించక కూలీ పనులకు పోయో యువతను చూశామన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతొ ఒక్కసారిగా పరీస్థితులు పూర్తిగా మారిపోయాయని, తిరిగి ఇవ్వనవసరం లేకుండా,  పంటను సాగుచేసే ప్రతిరైతుకు రైతుబందును అందించుకుంటున్నామని,  ఎదైన  కారణంచేత రైతు మరణిస్తే ఆరైతు కుటుంబ ఆగం కాకుండా రైతుభీమాను అందించుకోవడం జరుగుతుందన్నారు.   ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా ఉండేందుకు కళ్యాణలక్ష్మీ పథకాన్ని అందించామని,   ఎక్కడా ఇప్పటి వరకు లేని విధంగా పుట్టబోయో బిడ్డ, తల్లి ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ లను అందించుకోవడం జరుగుతుందని తెలిపారు.  కుల, మత, వర్గాలకు తావులేకుండా బావితరాలకు గుర్తుండిపోయోలా అందరం సంతోషంగా జరుపుకునే దశాబ్ది ఉత్సవాల పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.