పేదలకుపనికిరాని గృహలక్ష్మి పథకం

పేదలకుపనికిరాని గృహలక్ష్మి పథకం

ముద్ర, జమ్మికుంట: బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ప్రజలను మోసం చేయడానికి గృహలక్ష్మి పథకం తీసుకువచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలే రామారావు ఆరోపించారు. ఇల్లంతకుంటమండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంగిలి రామారావు మాట్లాడుతూ నిరుపేదలకు పనికొచ్చే పథకం కాదన్నారు కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిస్తే బండి సంజయ్ కుమార్ రాజకీయ కోణంలో చూడొద్దు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కవితని అరెస్టు చేయనప్పుడే ప్రజలు బిఆర్ఎస్ బిజెపి ఒక్కటే అనే నిర్ణయానికి వచ్చారని ఎన్ని సంజాయిషిలు ఇచ్చిన ఎన్ని ప్రెస్ మీట్ లు పెట్టిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

బిజెపికి ఓటు వేస్తే ఓటు మునిగిపోయినట్టే అని ప్రజలు భావిస్తున్నారని రామారావు అన్నారు. 2014లో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తర్వాత 2018 లో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ప్రజలను మభ్యపెట్టిందన్నారు . మళ్ళీ ఎన్నికల నేపథ్యంలో గృహలక్ష్మి పథకం పేరుతో మరోమారు తెల్లని రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు.  తెల్ల రేషన్ కార్డు ఉన్న లేకున్నా నిరుపేద ప్రజలందరికీ మూడు లక్షల రూపాయల అందజేయాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు బండి మల్లేష్, గొడిశాల పరమేష్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, భోగం సాయి మోహన్ రెడ్డి,NSUI మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.