ఓయూ నుండి డాక్టరేట్ పొందిన రాజు

ఓయూ నుండి డాక్టరేట్ పొందిన రాజు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కాముని రాజుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర విభాగం  డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది. 'రిమోట్ సెన్సింగ్, జిఐఎస్, శాటిలైట్ పద్ధతిని ఉపయోగించి  భూగర్భ జలాల నాణ్యత' అనే అంశం మీద మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జరిపిన పరిశోధనకుగాను డాక్టరేట్ ను ప్రధానం చేశారు. థింక్ గ్లోబల్లి అండ్ యాక్ట్ లోకల్లీ అన్నట్లు పారిశ్రామిక అభివృద్ధి జరిగే ప్రాంతాల్లో ఈ పద్ధతి ద్వారా తక్కువ కాలంలో, తక్కువ వ్యయంతో దేశమంతా పరీక్షలు జరపగలమని అధ్యాపకులు డాక్టర్ డి. శశికళ పేర్కొన్నారు. ఈ పరిశోధన గ్రంథం ద్వారా మనోహరాబాద్ మండల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కాలుష్య నియంత్రణకు పరిష్కారాలు తెలియజేయడం జరిగిందని ఆమె తెలిపారు.