తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, జెడ్పి ఛైర్పర్సన్

తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, జెడ్పి ఛైర్పర్సన్

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని శంకరంపేట (ఆర్) మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ అమరులకు నివాళులర్పించారు. డిఎస్పి యాదగిరి రెడ్డి, తహసిల్దార్ మహేందర్ గౌడ్,  అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. అమరవీరుల ఆశయాలు సాధిద్దామని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదే అని వారు పేర్కొన్నారు.  పర్యాటకులు  సందర్శించే విధంగా అత్యాధునికంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.