పేదల గుడిసెలను తగలబెట్టిన దుండగులను అరెస్టు చేయాలి సిపిఎం పార్టీ జిల్లా మల్లేశం డిమాండ్

పేదల గుడిసెలను తగలబెట్టిన దుండగులను అరెస్టు చేయాలి సిపిఎం పార్టీ జిల్లా మల్లేశం డిమాండ్

మెదక్:మెదక్ పట్టణ పరిధిలోని 248 /1 పట్టా భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని గత నాలుగు నెలలుగా నివాసం ఉంటుండగా వాటిని తగలబెట్టడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి  ఏ.మల్లేశం అన్నారు. పేదల గుడిసెలను మంగళవారం ఆయన సందర్సించి గుడిసెల దగ్గరి నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం పేదలకు ప్రభుత్వము పట్టాలను ఇచ్చి పొజిషన్ చూపించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.  ఖాళీ ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుంటే కొంతమంది ప్రైవేటు కాంట్రాక్టర్లు,

రియల్టర్లు, మాజీ రాజకీయ నాయకులు పేదలపై కక్ష గట్టి పట్టపగలు గుడిసెల్లో మనుషులు ఉండగా వారిపై భౌతిక దాడి చేసి గుడిసెలను తగలబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గుడిసెలను తగలబెట్టడానికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  అధికారుల దృష్టికి పట్టాల సమస్య తీసుకెళ్లినా పరిష్కరించకుండా  నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలని, గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు  మల్లేశం,  నర్సమ్మ, పార్టీ జిల్లా సభ్యులు గీత, సంతోష్, పార్టీ సభ్యులు జగన్, అజయ్, మొయినుద్దీన్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.