కొనాపూర్ లో మద్యపాన నిషేదానికి గ్రామస్తుల తీర్మానం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల నాయకులు, యువజనలు గ్రామస్తులు, సంపూర్ణ మధ్య పాన నిషేధానికి తీర్మానించారు. శనివారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ఇకపై బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా తీర్మానానికి వ్యతిరేకంగా మధ్యం అమ్మినట్టయితే వారికి 50 వేల రూపాయల జరిమానా, అదేవిధంగా ఎవరైనా మద్యం అమ్మె టప్పుడు పట్టించిన వారికి 5000 రూపాయల నజరానా అని తీర్మానం చేశారు. 

గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువై విచ్చలవిడిగా మద్యం అమ్మడం, మద్యం  సేవించడం వల్ల గ్రామస్తులు ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారని, గ్రామస్తుల బాగుకోసం గ్రామంలో మద్య నిషేధం విధించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు.

ఇప్పటి వరకే ఉమ్మడి రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం, బచ్చు రాజు పల్లి, కె. వెంకటాపూర్, నార్లాపూర్, చల్మెడ గ్రామాలలో  సంపూర్ణ మధ్య పాన నిషేధం చేయగా అదే తరహాలో కొనపూర్ లో మద్య పాన నిషేధం విధించారు