ఈ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..! 

ఈ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..! 

ఒక కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణం కాపాడింది. 108 కు ఫోన్ చేసిన వెంటనే సకాలంలో స్పందించి ఫోన్ సిగ్నల్ ద్వారా క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వివాహితను రక్షించాడు.  నిజంగా రక్షక భటుడే అనిపించుకున్నాడు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిగా, చాకచక్యకంగా ఓ ప్రాణాన్ని కాపాడిన తీరుకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. హైదరాబాద్​లోని  ఓల్డ్ అల్వాల్ పరిధిలోని హస్మత్‌పేట్‌, అంజయ్యనగర్‌కు చెందిన రేష్మ(24)ను భర్త ఐదేళ్ల క్రితం వదిలి వెళ్లాడు. అప్పటినుంచి కుమారుడు (5), తల్లి చాంద్‌బీబీతో కలిసి నివసిస్తుంది. ఎప్పటికైనా భర్త వస్తాడని ఆశగా ఎదురుచూస్తూ మానసికంగా కుంగిపోయింది. శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు గమనించి డయల్‌-100కు ఫోన్‌ చేసి తెలియజేయగా వారు అల్వాల్‌ పీఎస్‌కు సమాచారం అందించారు.  అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ భాస్కర్‌ తోటి సహచరుడుతో కలిసి ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా అంజయ్యనగర్‌కు కేవలం 3 నిమిషాల్లో చేరుకున్నాడు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. స్థానికుల సహాయంతో రేష్మను కిందకి దించి 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రేష్మ కోలుకుంటుంది. భాస్కర్‌ను అల్వాల్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ గంగాధర్‌, స్థానికులు అభినందించారు.