పునః పరిశీలనలో 10/10 జిపిఏ

పునః పరిశీలనలో 10/10 జిపిఏ

శంకరపట్నం ముద్ర జూన్ 16: పదవతరగతి పరీక్ష ఫలితల పునః పరిశీలనలో ఓ విద్యార్థిని 10 జీపీఏ సాధించిన విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కొత్తపల్లి వైష్ణవి పదో తరగతిలో 10 జిపిఎ సాధించాలని పట్టుదలతో పరీక్షలు రాశానని, దీనిపై వ్రాసిన పరీక్షల పత్రాల ను పునః పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోని ఫీజు  కట్టింది. పునః పరిశీలనలో వైష్ణవి  శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షలో 9.7 కొత్తపల్లి వైష్ణవి సాధించింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థిని సైతం 10 జిపిఏ రాలేదని  ఆందోళనకు గురయ్యారు.

10 జిపిఏ సాధించవలసిన వైష్ణవికి   9.7 రావడం నమ్మలేదు , తప్పు గా వచ్చాయి అని  వైష్ణవి  పునః పరిశీలన కోసం సాంఘిక శాస్త్రంలో దరఖాస్తు చేసుకోగా,వచ్చిన మార్కులు 75 కు బదులు 55 గా నమోదు చేయడం వల్ల సాంఘీక శాస్త్రం లో తప్పుడు తడకలుగా లెక్కించగా 10 జిఫిఏ కోల్పోవాల్సివచ్చిందని  నిర్ధారణ జరిగింది.  దీంతో విద్యార్థిని 10/ 10 జీపీఏ సాధించిందని తప్పుడు లెక్కలతో  అప్పుడు 9.7 వచ్చిందని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థినిని పాఠశాల ప్రధానో ఉపాధ్యాయురాలు తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.విద్యార్థి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.