సెల్ ఫోన్ ఎందుకు ఇస్తలేవు

సెల్ ఫోన్ ఎందుకు ఇస్తలేవు

రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: పదవ తరగతి ప్రశ్నా పత్రం లీక్ లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పోలీసులకు సెల్ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. స్థానిక తారక్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరుడుగట్టిన బిజెపి కార్యకర్త ప్రశాంత్ తో చాట్ చేసింది వాస్తవం కాదా అన్నారు. వాట్సాప్ లో ప్రశ్న పత్రం వస్తే నేరమా అని బండి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తన సెల్ ఫోన్ పోలీసులకు ఏం పని అనడం సిగ్గుచేటు అన్నారు. బాధ్యత గల ఎంపి పోలీసులకు సహకరించాల్సింది పోయి విమర్శించడం ఏంటి అని అన్నారు. పోలీసులను ప్రివిలేజ్ మోషన్ పేరుతో బెదిరిస్తున్నాడని మండిపడ్డారు.

లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నాడని ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టిన ఘనత కేసీఆర్ దే అన్నారు. స్థానిక ఎంపీ జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకురాలేని స్థితిలో ఉండడం దురదృష్టకరం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. కేంద్రం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ పెండ్యాల మహేష్ కేమసారం తిరుపతి తో పాటు పలువురు పాల్గొన్నారు.