బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
  • కెసిఆర్ తాటాకు చప్పుళ్ళకు బిజెపి భయపడదు
  • బండి సంజయ్ పై కుట్రపూరితంగానే కేసు
  • కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి
  • బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్  పై కక్ష కుట్రపూరితంగానే అక్రమ కేసులు నమోదు చేశారని,  ప్రభుత్వం వెంటనే అక్రమ కేసులను ఉపసంహరించుకోని, బేషరతుగా బండి సంజయ్ ని విడుదల చేయాలని , కెసిఆర్ తాటాకు చప్పులకు బిజెపి భయపడదని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టు, కేసును  నిరసిస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్  పై కుట్రపూరితంగా కేసు నమోదు చేసినట్లు స్పష్టంగా కనబడు తుందన్నారు. కేసు పూర్వాపరాల్లో అనేక అంశాలు అనుమానానికి తావిస్తున్నాయని , అక్రమంగా బండి సంజయ్ పై కేసు నమోదు చేయించి , అక్రమ పద్ధతిలో అరెస్టు చేసి జైలుకు తరలించడం అ ప్రజాస్వామికమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజా పోరాటాలు చేస్తున్న బండి సంజయ్ కుమార్  పనితీరు విధానాన్ని కెసిఆర్ ప్రభుత్వం జీర్ణించుకోలేకఅక్రమ కేసులతో  బెదిరించాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.

కెసిఆర్ తాటాకు చప్పులకు బిజెపి భయపడదని, అక్రమ కేసులతో వేధించాలనుకుంటే  బి ఆర్ఎస్ కు తగిన గుణపాఠం తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. బండి సంజయ్అక్రమ అరెస్టుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, ప్రశ్నించే గొంతుకలను పార్టీలను అణగదొక్కడానికి  కేసీఆర్ ప్రభుత్వం  ప్రయత్నిస్తుందని , ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని , దీన్ని ప్రజాస్వామ్యవాదులు పూర్తిగా ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు.. ముఖ్యంగా ఇటీవల కాలంలో పేపర్ లీకుల సంఘటన తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందన్నారు. అలాగే బిజెపి వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ చేస్తే దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో పూర్తి ఖర్చుభరిస్తానని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దేశంలోని అనేక పార్టీలకు ఆఫర్ చేసిన విషయం  చర్చనీయాంశంగా మారిందన్నారు.

లీకేజీ ,ప్యాకేజీ అంశాలతో  బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్     ప్రజల దృష్టిని మరల్చడానికి  నానా తంటాలు పడుతుందని , వీటిని ప్రశ్నిస్తున్న బిజెపిని ఎదుర్కోవడానికి అప్రజాస్వామ్యపద్ధతి,అక్రమ కేసులు అరెస్టుల మార్గాన్ని ఎంచుకోవడం సిగ్గుచేటన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ పెట్టిన అక్రమంగా పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని , ఆయనను బేసరట్టుగా విడుదల చేయాలని లేకపోతే బిజెపి ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, గుగ్గిళ్ళపు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కళ్లెం వాసుదేవ రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మేకల ప్రభాకర్ యాదవ్, బండ రమణారెడ్డి ,పుప్పాల రఘు, బల్బీర్ సింగ్, బొంతల కళ్యాణ్ చంద్ర, సంకిటి శ్రీనివాస్ రెడ్డి, సోమిడి వేణు,నాగసముద్రం ప్రవీణ్, ఆవుదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, పాదం శివరాజ్, సుగుర్తి జగన్, వరాల  జ్యోతి, పుల్లెల పవన్ తదితరులు పాల్గొన్నారు.