సైబరాబాద్ లో ప్రశాంతంగా హనుమాన్ జయంతి

సైబరాబాద్ లో ప్రశాంతంగా హనుమాన్ జయంతి

PSIOC నుంచి పర్యవేక్షించిన సైబరాబాద్ సీపీ 

ముద్ర ప్రతినిధి,  రంగారెడ్డి: హనుమాన్  జయంతిని పురస్కరించుకొని సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో  విజయోస్తవ ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని సైబరాబాద్  స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సైబరాబాద్ సీపీ సమీక్షించారు. సైబరాబాద్ పరిధి లోని 184 విజయోస్తవ ర్యాలీలు పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా కొనసాగాయి. హైదరాబాదులో అత్యంత కీలకమైన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ (PSIOC) ద్వారా ప్రతిక్షణం సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారన్నారు.

PSIOC లో పదివేల సీసీ కెమెరాలు కమ్యూనిటీ సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయన్నారు. ఈ కేంద్రంలోని అన్ని విభాగాలు ఒకే చోట ఉండి ప్రతి అంశాన్ని చిత్రీకరిస్తూ చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడం నేరాలను కట్టడి చేయడం ట్రాఫిక్ నియంత్రణ తదితర వాటిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రజల సౌకర్యార్థం సైబరాబాద్ పోలీసులు ముందస్తుగానే ట్రాఫిక్ అడ్వైజరీలను విడుదల చేశామన్నారు. సైబరాబాద్ పోలీసులు ముందస్తుగా తీసుకున్న భద్రతా చర్యల్లో భాగంగా సోషల్ మీడియా పై నిఘా ఉంచామని, అందుకే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ర్యాలీలు ప్రశాంతంగా కొనసాగాయన్నారు. సిపి గారి వెంట ఎస్బి ఏడిసిపి రవికుమార్, PSIOC ఏసీపీ రవీందర్, ఐటీ ఇన్స్పెక్టర్ జూపల్లి రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ పులి యాదగిరి, ఇతర సిబ్బంది ఉన్నారు.