ఏఐఎస్ఎఫ్ కరపత్రం ఆవిష్కరణ

ఏఐఎస్ఎఫ్ కరపత్రం ఆవిష్కరణ

 శంకరపట్నం ముద్ర జూన్ 24: శంకరపట్నం మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నాపూర్ లో శనివారం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్ చలో బోడుప్పల్ కరపత్రాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26 నుండి 28 వరకు మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో  జరగబోయే రాష్ట్రస్థాయి విద్యా విజ్ఞాన రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు.కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అయన అభిప్రాయ పడ్డారు.మండల కేంద్రం నుండి యువకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చాడు.ఈ కార్యక్రమంలో    ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, కృష్ణ , అనుదీప్, చందు తదితరులు పాల్గొన్నారు.