తాటివనంను నరికి, నిప్పంటించారు   

తాటివనంను నరికి, నిప్పంటించారు   
  • గీత కార్మికుల పొట్టగొట్టారు
  • గీత కార్మికులపై బెదిరింపులు

ముద్ర సైదాపూర్: గీతకార్మికులు అనాదిగా కల్లుగీత నే నమ్ముకుని బతుకుతున్నారు. కాగా తమ జీవనాధారమైన తాటి చెట్లను ఎదేశ్చగా నరికేస్తున్నారు. ఇదెందని ప్రశ్నిస్తే దుర్బాషలాడుతూ దాడులకు దిగుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మండలంలోని సోమారం గ్రామ శివారులోని కొందరు వ్యక్తులు తాటి చెట్లకు నిప్పు పెట్టి చెట్లను కాల్చివేశారు. మరి కొన్ని చెట్లను నరికి వేశారని గీత కార్మికులు తెలిపారు. ప్రభుత్వ భూములలో ఉన్నతో పాటు పట్టా భూముల్లో ఉన్న తాటి చెట్లను కొందరు కావాలని నరికి వేశారని, ఇదేందని అడిగినందుకు తమ బెదిరిస్తున్నారని తెలిపారు. 

రాత్రి వేళల్లో జెసిబి ల తో  తొలగించేస్తున్నారని తెలిపారు.  గీత కార్మిక కుల వృత్తిని నమ్ముకుని గ్రామంలో 90 కుటుంబాలు జీవిస్తున్నామని తమకు కానీ అధికారులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ ఉపాధి మార్గాన్ని కొల్లగొట్టిన వ్యక్తులపై చట్టరీత్యా శిక్షించాలని తమకు ఉపాధి మార్గం చూపించాలని గీత కార్మికులు తెలిపారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.