11 న మెగా జాబ్ మేళా

11 న మెగా జాబ్ మేళా

చిగురుమామిడి ముద్ర న్యూస్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిగురుమామిడి ఎస్సై రాజేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని చిగురుమామిడి మండల యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పది, ఆపై తరగతుల వారు ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగం సాధించి పేరు తెచ్చుకోవాలని ఎస్సై కోరారు.