మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన  గవ్వ వంశీధర్ రెడ్డి

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన  గవ్వ వంశీధర్ రెడ్డి

  చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని  ఓగులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్  కోమటిరెడ్డి   రామ్ రెడ్డి గత నాలుగు రోజుల క్రితం మరణించగా...  గురువారం ఏఐఎస్బి స్టేట్ జనరల్ సెక్రటరీ గవ్వ వంశీధర్ రెడ్డి వారి కుమారులైన  భగవాన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ని పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రామ్ రెడ్డి  మరణం తీవ్ర బాధాకరమని సర్పంచ్ గా ప్రజలకు ఎనలేని సేవ అందించారని  ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులుగా  అజాతశత్రువుగా ఉన్నారని అన్నారు. ఆయన వెంట గవ్వ కిషన్ రెడ్డి,  దొనపాటి రాజిరెడ్డి, ముస్కు  మైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.