పౌర సేవలు పకడ్బందీగా అమలు

పౌర సేవలు పకడ్బందీగా అమలు

మేయర్ యాదగిరి సునిల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు పౌర సేవా కేంద్రం పేరిట మున్సిపల్ నూతన విధానాన్ని అమలు చేస్తున్న ఘనత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో మేయర్ విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ లో పౌర సేవా కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న ఆన్ లైన్ పౌర సేవల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ నగర ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో సీటిజన్ చాట్ ( పౌర సేవా కేంద్రం) ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజన్ తో నూతన మున్సిపల్ విధానం లో ప్రజలకు ఆన్ లైన్ సేవలను తేవడం జరిగిందన్నారు. ప్రతి ఆన్ లైన్ సేవలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజల ఇబ్బందులు తొలగిస్తున్నట్లు తెలిపారు.

నగర పౌరులు నల్లా, ఇంటి పన్ను , బర్థ్ ,డెత్ సర్టిఫికేట్ ల కోసం ఇచ్చిన దరఖాస్తుల పరిష్కార విషయంలో పౌర సేవల కేంద్రం ఆన్ లైన్ విధానం ద్వారా పూర్తి స్థాయి చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పురపాలక శాఖ మాత్యులు కేటి రామారావు విజన్ వల్ల చాలా వరకు సర్వీసెస్ లు ఆన్ లైన్ విధానం లోనే జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఒక మోటేషన్ కావాలంటే సంబంధిత యజమాని మున్సిపల్ చుట్టు అధికారుల చుట్టు నెలల తరబడి తిరిగే పరిస్తితి ఉండేదన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ విధానంలో సెల్ఫ్ అసెస్ మెంట్ ద్వారా ఇంటి నెంబర్లు ఇస్తున్న ఘనత కేటీఆర్ దన్నారు. అంతే కాకుండా మోటేషన్ అనేది ఆస్తి కొనుగోలు చేసిన తర్వత సంబందిత యజమాని వచ్చి నగరపాలక సంస్థ లో ధరఖాస్తు చేసుకుంటే అయ్యేదని ప్రస్తుతం ఆస్తి కొనుగోలు రిజిస్ట్రేషన్ లోనే మోటేషన్ రావడం జరుగుతుందని అది నూతన ఆన్ లైన్ విధానం ద్వారా మంత్రి కేటీఆర్ చొరవతోనే సాద్యమైందన్నారు.