జ్యోతిష్మతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై అవగాహన

జ్యోతిష్మతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై అవగాహన

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల , జ్యోతిష్మతి జాతీయ సేవా పథకం(NSS CELL)- జ్యోతిష్మతి బ్రిగేడ్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు గీతా భవన్ చౌరస్తా నుండి ప్రారంభమై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 10 డివిజన్లలో  రెండవ పేజ్ ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

గీతా భవన్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో  కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సేవా ఎస్లావత్  ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తూ ఈరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వచ్చే అనర్ధాలను ప్రజలకు వివరించడం ద్వారా వాటి నష్టాలను అరికట్టవచ్చునని తద్వారా ప్రపంచాన్ని ప్లాస్టిక్ విపత్తు నుండి కాపాడవచ్చునని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రం స్మార్ట్ సిటీగా అవతరించడం మనందరికీ గర్వకారణం అని కావున ప్రజలందరూ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని వాడకుండా, ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పడవేయకుండా నగరాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడితే వారు శిక్షార్హులవుతారని, ఫైన్ కూడా విధిస్తామని తెలిపారు.

నగర మేయర్ యాదగిరి సునీల్ రావు  తన 33వ డివిజన్లో విద్యార్థులు చేస్తున్నటువంటి ప్లాస్టిక్ కార్యక్రమాన్ని ఆయన చూసి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ వారిని ప్రోత్సహించారు. నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కళాశాల చైర్మన్  జువ్వాడి సాగర్ రావు  నేతృత్వంలో విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్లి ప్లాస్టిక్ వాడడం వలన వచ్చే అనర్థాలను వివరిస్తూ వారికి ఒక కరపత్రాన్ని అందిస్తూ రోడ్డు వెంబడి ఉండే ప్లాస్టిక్ చెత్తను తీసివేయడం జరుగుతుందని, ఈ రెండవ ఫేజ్ లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 10 డివిజన్ల లో కార్పొరేటర్ల సహకారంతో తమ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని  జ్యోతిష్మతి ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశ్వ ప్రకాష్ బాబు , కళాశాల ఇన్చార్జి తోట ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. 

అనంతరం విద్యార్థులు దుకాణాలు, ఇళ్లకు వెళ్లి ప్లాస్టిక్ వల్ల వచ్చే ప్రమాదాలను వివరించి చెప్పారు. ప్లాస్టిక్ వాడవద్దని నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనలు చేస్తూ ప్లాస్టిక్ వాడకూడదని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు.  డిప్యూటీ మేయర్  చల్లా స్వరూప హరిశంకర్ , 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్ , బిఆర్ఎస్ నాయకులు వీ.నరీన్ కాంత్ విద్యార్థులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో  డిప్లమో ఇంచార్జ్ సి.హెచ్ .సజన్ రావు, ఫిజికల్ డైరెక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు, కోఆర్డినేటర్లు డాక్టర్ దావా శ్రీనివాస్, డాక్టర్ ప్రణీత, డాక్టర్ శ్రీలత, భాగ్య, డాక్టర్ పబ్బా పరమేశ్వర్, ఉదయ్ ప్రకాష్ , యస్.గోపాల్ రెడ్డి,సతీష్ చంద్ర, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, సతీష్ గౌడ్ , చంద్రశేఖర్, భగవాన్ రెడ్డి , సృజన్ ,అంజలి, యo.డి రహీం, ఫిర్దోష్ ఫాతిమా లతోపాటు అధ్యాపకులు,వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.