ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

గన్నేరువరం, ముద్ర న్యూస్: మండల కేంద్రం గన్నేరువరంలో మంత్రి హరీష్ రావు  జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాలి లింగారెడ్డి, గొల్లపల్లి రవి, పుల్లెల సాయికృష్ణ , ముసుకు కరుణాకర్ రెడ్డి, కూన సంపత్, తదితరులు పాల్గొన్నారు.