హిందువుల పండుగల పై  నిర్లక్ష్యం ఎందుకు ?

హిందువుల పండుగల పై  నిర్లక్ష్యం ఎందుకు ?

బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : హిందువుల ఆరాధ్య దైవం ,ప్రధమ పూజలందుకునే వినాయక నవరాత్రి ఉత్సవాల పట్ల కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కరీంనగర్ లోని వినాయక మండపాల వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కనీస ఏర్పాట్లు చేయకపోవడం తగదని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం, నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో  కనీస సౌకర్యాలు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి కల్పించకపోవడం విచారకరమన్నారు. 

కరీంనగర్లోని చాలా ప్రాంతాల్లో నీ మంటపాల వద్ద    రహదారులు సరిగ్గా లేవన్నారు. మంటపాల వద్ద గుంతలు పూడ్చి, డస్ట్ పోయాల్సిన నగరపాలక సంస్థ నిద్రమత్తులో ఉందన్నారు. ఇప్పటికీ వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం కనీస ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ ఆలోచన చేయకపోవడం సరికాదన్నారు. హిందువుల పండుగల పట్ల మున్సిపల్ కార్పొరేషన్ వివక్ష ప్రదర్శిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ లు తక్షణం వినాయక మంటపాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.