జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ను అభినందించిన డిజిపి

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ను అభినందించిన డిజిపి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈ సంవత్సరం న్యాయస్థానంలో హత్యల కు సంబంధించిన 10  కేసుల్లో 16 మందకి  జీవిత ఖైదు పడేలా ప్రత్యేక చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ను డిజిపి అంజనీ కుమార్ అభినందించారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్, సైబర్ క్రైమ్ లపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పి. లతో డిజిపి అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పెండింగ్ కేసులు,  క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ ,గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్షల  నుండి తప్పించుకొలేరనే భావన నేరస్తులు కలిగించాలని సూచించారు. 

ఈ సంవత్సరం రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానలో 135 కేసుల్లో జీవిత ఖైదులు పడ్డాయని తెలిపారు. గడిచిన 2022 సంవత్సరంలో జగిత్యాల జిల్లాలో హత్యలకు సంబంధించి ఒకే జీవిత ఖైదు విధించగా 2023  సంవత్సరం జిల్లా పోలీసులు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల  హత్యలకు సంబంధించి 10  కేసుల్లో 16 మందికి జీవిత ఖైదీపడేలా కృషి చేసిన జిల్లా ఎస్పీని, అధికారులను, సిబ్బందిని డిజిపి అభినందించడంతో పాటు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పని చేయాలని సూచించారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీతో పాటు  అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, డీఎస్పీ లు వెంకటస్వామి, రవీంద్ర కుమార్, రవీంద్ర రెడ్డి, సిసిఎస్, డిసిఆర్ బి, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ లు వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, రఫీక్ ఖాన్,సిఐ  రమణమూర్తి, డిసిఆర్ బి సిబ్బంది పాల్గొన్నారు.