విద్యుత్ వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి 

విద్యుత్ వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి 

చిగురుమామిడి ముద్ర న్యూస్:  ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం మంగళవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లతోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.  మండలంలోని విద్యుత్ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండడం లేదని, గ్రామంలో కరెంటు పోతే ఎప్పుడు వస్తుందనే సమాచారం తెలిపే లైన్మెన్లు సైతం ప్రజా ప్రతినిధుల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ అధికారులు సైతం గ్రామాల్లో నామ్కే వస్తుగా రైతు వేదికలో సమావేశాలు నిర్వహించారు తప్ప రుణమాఫీపై బ్యాంక్ అధికారులతో మాట్లాడి రైతులకు రుణమాఫీ పై వివరించడం లేదని తెలిపారు. అంగన్వాడి పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో సైతం పరిశుభ్రతంగా ఉండడం లేదని పిల్లలకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయని పలువురు సభ్యులు తెలిపారు. 

అన్ని శాఖల అధికారులపై సభ్యులు మండిపడడం విశేషం అనంతరం ఎంపీపీ కొత్తవినిత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ అధికారులు రైతులకు గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని, ఏ ప్రజా ప్రతినిధి ఏ రైతు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి సమాధానం చెప్పి పనిచేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ఏఈవోలు రైతు వేదికలతో పాటు రైతులకు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటూ బ్యాంకు అధికారుల దగ్గరికి వెళ్లి రైతుల సమస్యలపై రుణమాఫీపై సరైన సమాధానం ఇచ్చి రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇటు వ్యవసాయంపై అటు రుణమాఫీ పై సమాధానం ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అంగన్వాడి ప్రభుత్వ పాఠశాల లో తోపాటు గ్రామంలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశంలో సిపిడిఓ సబిత, తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో నర్సయ్య వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.