జగిత్యాల జిల్లాలో దారుణం అన్నను చంపిన తమ్ముడు..

జగిత్యాల జిల్లాలో దారుణం అన్నను చంపిన తమ్ముడు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  బుగ్గారం మండలం చిన్నాపూర్ లో ఆదివారం రాత్రి పాత కక్షల నెపంలో అన్నను తమ్ముడు రోకలి బండతో మోది హత్య చేశాడు, చిన్నాపూర్ గ్రామానికి చెందిన ఇడగొట్టు శ్రీనివాస్ కు ఆయన అన్న  తిరుపతికి మధ్య పాత గోడవలు ఉన్నాయి. ఆదివారం రాత్రి తిరుపతి ఇంట్లో నిద్రిస్తుండగా తమ్ముడు శ్రీనివాస్ రోకలి బండతో మోది హత్య చేశాడు. మృతుడు తిరుపతి ఫై పదికి ఫైగా పొలిసు కేసులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ధర్మపురి సిఐ కోటేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోద్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.