ఇథనాల్ ప్యాక్టరీ వద్దంటు బోనాలతో పాసిగామ ప్రజల నిరసన..

ఇథనాల్ ప్యాక్టరీ వద్దంటు బోనాలతో పాసిగామ ప్రజల నిరసన..

మద్దతు ప్రకటించేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టు

ముద్ర వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని  స్థంభంపల్లి గ్రామ శివారులో ఇథనాల్ ప్యాక్టరి నిర్మాణం జరుపవద్దని మండలంలోని పాసిగామ ప్రజలు గురువారం బోనాలతో భారీ నిరసన తెలియజేశారు.  కాగా వీరికి మద్దతు పలికేందుకు వస్తున్నారన్న సమాచారం మేరకు కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామ శివారులో క్రిబ్ కో కంపెనీ ఆధ్వర్యంలో ఇ థనాల్ ప్యాక్టరి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా పాసిగామ, స్థంభంపల్లి గ్రామాల ప్రజలు అడుగడుగున అడ్డుకుంటున్నారు.

అక్కడ జే సీబీ కనబడిన, అధికారులు వెళ్లిన ఊరు ఊరంతా ఏకమై అక్కడికి వెళ్లి వారిని అడ్డుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం పాసిగామ ప్రజలంత కలిసి నాగ దేవతకు పెద్ద మొత్తంలో పూజలు చేశారు. ఈరోజు ఇంటికి ఒక బోనం చొప్పున వండుకొని వెళ్లి రాష్ట్ర రహదారి పక్కన గల రోడ్డు మైసమ్మకు పూజలను నిర్వహించారు.  ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపి వేసేలా చూడాలని కోరారు. కాగా అక్కడికి ధర్మపురి సీఐ కోటేశ్వర్, వెల్గటూర్ ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలను మొహరించారు. కాగా ఇథనాల్ ప్యాక్టరీ పుణ్యమా అని పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.