సీఎం ప్రకటించిన అందని రూ 10 వేలు  సాయం  

సీఎం ప్రకటించిన అందని రూ 10 వేలు  సాయం  

బిఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నదాత గోడు పట్టదా
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించండి 
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.భోగ.శ్రావణి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత ఐదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానకు నష్ట పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  డా.భోగ.శ్రావణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయికల్ మండలంలో కిష్టంపెట్, కుమ్మరి పల్లి, కొత్తపేట్ గ్రామాల్లో అకాల వర్షం వల్ల నష్టపోయిన నువ్వు, మొక్కజొన్న ,  వరి పంటలను, మామిడి తోటలు శ్రావణి పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. అనంతరం శ్రావణి  మీడియాతో మాట్లాడుతూ  రైతుల మీద ప్రకృతి కన్నెర్ర చేసిందని మార్చిలో వడగళ్ల వానలు పడి పంట నష్టపోయిన రోజు రైతాంగాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తే.. సీఎం కెసిఆర్ హెలికాప్టర్ లో తిరిగి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు సైతం ఎకరానికి రూ. 10 వేలు సహాయం అందిస్తామని చెప్పి నేటికి ఒక్క రూపాయి సాయం అందించలేదన్నారు. జగిత్యాల లో ఇద్దరు పెద్ద నాయకులు కేవలం మైనారిటీ ఓట్లు కోసం ఫొట ఫోటిగా ప్రెస్స్ మీట్ లు పెట్టారు కానీ రైతుల ఫై స్పందిచా లేదని, ఎంపీ అరవింద్  రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ద్వార ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. మొన్న వర్షం వడగండ్ల వాన తాకిడికి తట్టుకొని మిగిలిన పంట ఈ సారి పూర్తిగా పోయిందని, మామిడి కాయ రాలిపోయి, మిర్చి, మక్క, వరి, నువులపంట అన్నీ కొట్టుకుపోయాయన్నారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు  వచ్చి నష్టపోయిన పంట వివరాలు రాసుకొని ప్రభుత్వం కి నివేదిక వెంటనే ఇవ్వాలిని డిమాండు చేశారు.పంజాబ్, మహారాష్ట్ర రైతులను కాదు నీకు ఓట్లు వేసి గెలిపించిన వారి బ్రతుకులు ఆగం అవుతున్నాయి. వారిని ఆదుకోండి లేకపోతే వారి ఉసురు తగులుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఫసల్ భీమా అమలు చేసి ఉంటే రైతులకు ఆసరాగా ఉండేదని, నష్టపోయిన మామిడి తోటలకు ఎకరానికి లక్ష రూపాయలు, మొక్క జోన్నకు 40 వేలు, వరికి 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీర్పూర్ మండల ఇంచార్జి పడాల తిరుపతి, ఉడుత  రాంసురేష్, ఉడుత రవీందర్ ఆడెపు. సురేష్, ఆవుల.రాజశేఖర్,  వేములవాడ.మహేష్, గాజెంగి.విష్ణువర్ధన్,