ఫంక్షనల్ వర్టీకల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ

ఫంక్షనల్ వర్టీకల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ
  • పోలీస్ శాఖ అమలు చేస్తున్న  వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి
  • నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 52 మంది  పోలీస్ లకు రివార్డులు
  • జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  పోలీస్ శాఖలో అమలు చేస్తున్న  వర్టీకల్స్ జిల్లాలో  ప్రతి పోలీస్ అధికారి సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వివిధ రకాల వర్టికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు రివార్డులను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ  ఫంక్షనల్ వర్టికల్ ద్వారా పోలీస్ అధికారులకు సిబ్బందికి పని భారం తగ్గుతుంది, టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించవచ్చని, పని విభజన, రోల్ క్లారిటీ ద్వారా ప్రతి ఒక్కరికీ బాధ్యత పెరుగుతుందని అన్నారు. ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు.  

ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ డాటా నమోదు పరిచిన విధంగా  సిసిటిఎన్ఎస్, టిఎస్ కాప్  ఆధారంగా వారి యొక్క పనితనాన్ని బట్టి రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంద, ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేల ప్రతి ఒక్క అదికరి కృషి చేయాలని సూచించారు . ఈ సందర్బంగా ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 52 మంది  పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు, రివార్డులను ఎస్పీ అందజేశారు.  ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ బి, డిసి ఆర్ బి, ఐటీ కోర్  ఇన్స్పెక్టర్ లు  రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్ మరియు ఎస్సైలు, ఏ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.