జగిత్యాలలో కమల వికాసం ఫై నాయాకుల ముమ్మర యత్నం

జగిత్యాలలో కమల వికాసం ఫై నాయాకుల ముమ్మర యత్నం
  • నిజామబాద్ ఎంపి అరవింద్ జగిత్యాల పర్యటనఫై సర్వత్ర ఆసక్తి 
  • బిఆర్ ఎస్ నాయకుడు కరీంనగర్ డిసిఎంఎస్ సోదరుడిని కలిసిన అరవింద్ 
  • సియంతో సాన్నిహిత్యం ఉన్న డా. ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి పయనమెటు ?

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బిజేపి అగ్ర నాయకులు టార్గెట్ జగిత్యాల పేరుతో పని చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అంతర్గంతంగా పలువురిని ఫోన్లో  సంప్రదిస్తు టచ్ లో ఉంటూ  చాపకింద నీరుల విస్తరిస్తూపోతున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపి అరవింద్ సుడిగాలి పర్యటన  సర్వత్ర ఆసక్తి రేకెత్తిస్తుంది. బిజేపి జాతీయ స్థాయిలో మహాజన్ సంపర్క్ అబియాన్ పేరుతో ప్రజలను, ప్రముఖులను కలసి కేంద్ర ప్రభుత్వ, నరేద్ర మోడీ పాలనను వివరించాలని ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. దినీని జగిత్యాల బిజేపి నాయకులు ఇప్పటికే ఆరంబించి పలు వార్డులను చుట్టి వస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుంది.  వాస్తవానికి నిజామబాద్ ఎంపి అరవింద్ కార్యక్రమం కోరుట్లలోనే ఉంది.. జగిత్యాల షెడ్యులు లేదు. అయినప్పటిక ఎంపి వస్తు వస్తూనే జగిత్యాలలో  పలువురిని కలిసేందుకు నిర్ణయించుకొని ఫోనులో తాను వస్తున్నట్లు సమాచారం అందించారు. అందులో బాగంగానే జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖ పిల్లల వైద్యులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డిని కలిసి మహాజన్ సంపర్క్ అబియాన్ పెరట ప్రధాని నరేద్ర మోది పాలనా అంశాల పుస్తకాన్ని అందించి వెళ్ళారు. యంపి కలసిన శ్రీనివాస్ రెడ్డి మినహా ఇతరులు ఎవ్వరు కూడా అంత రాజకీయ ప్రాధాన్యం ఉన్న వ్యక్తులు ఎవరు కాదు. దీంతో డా. శ్రీనివాస్ రెడ్డిని ఎంపి కలవడం ఫై జగిత్యాలలో రాజకీయ చర్చ జరుగుతుంది.

శ్రీనివాస్ రెడ్డి సోదరడు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షడుగా వ్యవహరిస్తున్నాడు.  డా. శ్రీనివాస్ రెడ్డి సామజిక సేవ కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి గల్ప్ బాధితులకు చేయూత ఇవ్వడం, అనాథ పిల్లలను చదివించి ఉపాధి కల్పిపించడం లాంటి   ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్లు వెచ్చించి 3000 విద్యార్థులను చదివించి వారకి చేయుతనందిచారు. ఇలాంటి కార్యక్రమాల గూర్చి తెలుసుకున్న సియం కేసిఆర్ ఓ సారి స్వయంగా ఫోన్ చేసి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడారు.అంతేకాదు ఇంటికి భోజనానికి కూడా వస్తానని చెప్పారు. ధర్మపురి పుష్కరాలకు వచ్చిన సందర్బంగా సైతం డా. శ్రీనివాస్ రెడ్డిని కలసి బోజనానికి వస్తా అన్న విషయాన్నీ సియం కేసిఆరే మరో మారు గుర్తు చేశారు. వీటిని బట్టి తెలుస్తుంది సిఎం కెసిఆర్ వద్ద కూడా మంచి పేరుందని. శ్రీనివాస్ రెడ్డి మంచిర్యాలలో ఆసుపత్రి నిర్వహించినపుడు ప్రజారాజ్యం  పార్టీనుంచి పోటి చేయాలనీ చిరంజీవి ఆహ్వానించగ తిరస్కరించారు. తెలంగాణ ఆవిర్బావం తర్వాత జగిత్యాల నియోజక వర్గం నుంచి టిఆరుఎస్ పార్టీ  తరుపున డా. శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా పరిశీలన ఉంది. అయితే ఎప్పటి నుంచో రాజయకియాలతో సంబంధం ఉన్న శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదయినా అవకాశం వస్తే రాజకీయ అరంగేట్రం చేయాలనే ఆలోచనలో ఉనట్లు తెలుస్తుంది. దీంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంతో మంది వైద్యులు ఉన్నప్పటికీ డా. శ్రీనివాస్ రెడ్డిని ఎంపి అరవింద్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోదరుడు డిసిఎంఎస్ చైర్మన్ గా ఉండి, సియంతో సాన్నిహిత్యం ఉన్న శ్రీనివాస్ రెడ్డి బిజేపి వైపు మొగ్గు చూపుతార అనే సందేహం వ్యక్తం అవుతుంది. అలా జరుగుతే బిఆర్ ఎస్ పార్టీకి కొంత మేర నష్టం జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.