కాలువ పై తేలిన ఇనుప చువ్వలు.. పట్టించుకోని అధికారులు

కాలువ పై తేలిన ఇనుప చువ్వలు.. పట్టించుకోని అధికారులు

మెట్‌పల్లి ముద్ర: కాలువ పై తేలిన ఇనుప చువ్వాలు ప్రమాదాలకు నెలవుగా మారాయి నిత్యం ఇదే కాలువ వంతెన పై నుండి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ ఈ తేలిన ఇనుప చువ్వలు కనబడకపోవడం విడ్డూరంగా ఉంది...వివరాల్లోకి వెళితే పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఎస్ ఆర్ ఎస్ పి ప్రధాన కాలువ పై వంతెన నుండి నిజామాబాద్ వైపు జాతీయ రహదారి ఉన్నది ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. గత ఏడాది క్రితం ఈ వంతెనపై గుంతలు ఉండడంతో సంబంధిత అధికారులు ఓ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించి మరమత్తులు చేయించారు.సంవత్సరం గడవక ముందే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో కాలువ వంతెన పై ఇనుప చువ్వలూ తేలి రెండు అడుగుల లోతు గుంత ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఆ వంతెన పై నుండి ప్రయాణించేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే రహదారిపై అధికారులు ప్రయాణిస్తున్న వారి కంటికి వంతెన పై ఏర్పడిన గుంత కనబడడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి గుంతను పూడ్చి వేయాలని అధికారులను కోరుతున్నారు.

అధికారులు స్పందించాలి..మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా. ప్రమాదాలు జరగకుండా అధికారులు స్పందించి ఎస్ ఆర్ ఎస్ పి కాలువ వంతెన పై ఏర్పడిన గుంతను పూడ్చి వేసి ప్రయాణికుల ప్రాణాలతో పాటు వాహనాలు చెడిపోకుండా కాపాడాలి..