బంజారాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి ...ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ పర్సన్ వసంత

బంజారాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి ...ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ పర్సన్ వసంత

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో బంజరాల సంక్షేమానికి  తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గిరిజన లాంబడి సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ సంతు సేవలాల్ 284వ జయంతి  వేడుకల్లో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్ పాల్గొని మహాబోగ్ కార్యక్రమంలో అగ్ని దేవతలకు పూజలు నిర్వహించారు, అనంతరం సేవాలాల్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని చిన్న చిన్న తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత సిఎం కేసిఆర్ దే అని అవసరమైన నిదులు మంజూరు చేసి, గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేయడం జరిగిందని చెప్పారు.

గిరిజన బందు అనే గొప్ప పథకం కూడా సిఎం ఆలోచనలో ఉందని గుర్తు చేశారు. గిరిజన విద్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని,. 10% రిజర్వేషన్ పెంచి గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచారని అన్నారు. సంత్ సేవలాల్ మహరాజ్ గారి ఆశయాలను అనుగుణంగా బంజారాలు నడుచుకోవాలని, వారు ఏ స్ఫూర్తి నిచ్చారో..ఆ స్పూర్తి తోనే సేవ పనులు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నడిబొడ్డున బంజారా భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్యరాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు, ఎంపిడిఓ సంతోష్ కుమార్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు,గిరిజన లంబాడీనాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.