పల్లెల అభివృద్ధికి నిరంతర కృషి - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

పల్లెల అభివృద్ధికి నిరంతర కృషి - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పల్లెల అభివృద్ధికి నిరంతర కృషి జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండల  గొల్లపల్లే గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ. 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, 5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంతతో కలిసి ఎమ్మెల్యే   భూమి పూజ  చేశారు. అనంతరం గ్రామ సపాయి కార్మికుడు రౌట్ల లక్ష్మన్ ను సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాస,భాష,సంస్కృతి అణచివేతకు గురి అయింది..తెలంగాణ రాష్ట్రం కోట్లాడి తెచ్చుకున్న ముఖ్యమంత్రి పల్లెల అభివృద్ది కి పక్కా ప్రణాళిక రూపొందించారని అన్నారు.గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు గా భావించి గ్రామాల అభివృద్ధి కి చెరువులు,పార్కులు,కంపోస్టు షెడ్డు,రైతు బంధు,భీమా, వైకుంఠ ధామం తదితర కార్యక్రమాలు చేపట్టారన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి నిరంతర కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, దేశంలో కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు.

రూ. 800 కోట్లుతో  ఏర్పాటు చేసే  ఇతనాలు ఫ్యాక్టరీ వల్ల నష్టం అని ప్రతి పక్ష నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. గతంలో పల్లెల్లో సాగు, తాగు నీళ్ళు లేని పరిస్తితి..నేడు మిషన్ కాకతీయ,భగీరథ తో నీటి గోస తీరిందని అన్నారు. ఈ  కార్యక్రమంలో  సర్పంచ్ ప్రకాశ్,ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పాక్స్ చైర్మెన్ మహిపాల్ రెడ్డి,ఎంపీటీసీ మమత,ఉప సర్పంచ్ తిరుపతి,జెడ్పీ సీఈఓ రామాంజనేయులు,ఎంపిడిఓ రాజేశ్వరి,ఎమ్మార్వో నవీన్,ఎంపీవో రవి బాబు,DE మీలింధ్,AE రాజ మల్లయ్య,సర్పంచులు బుర్ర ప్రవీణ్,సరోజన  మల్లారెడ్డి,సదాశివ రావు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్,శ్రీకాంత్, ప్రవీణ్,మల్లారెడ్డి,రాజు,యాదవ సంఘం అధ్యక్షులు గంగ మల్లయ్య,గంగ నీలయ్య, ,అధికారులు,ప్రజలు,పాల్గొన్నారు.