జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ 

జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ 

ప్రారంభోత్సవ వేడుకలు టి షర్ట్ ల లొల్లి .. మెప్మా సిబ్బంది పై ఆగ్రహం...

ముద్ర ప్రతినిధి,  జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకనంద మిని స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో  పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష జగిత్యాల, కొరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ దా వసంత,మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, జిల్లా క్రీడల అధికారి డాక్టర్ నరేష్, పిఇటిలు, తదితరులు పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణంలో లైట్స్ సౌండ్స్ ఏర్పాటు చేసిన మానస సౌండ్స్ యజమాని సతీష్ కు చెందిన రూ. లక్ష మాయమయ్యాయి. తాను తెచ్చుకున్న డబ్బులను ఎవరో కొట్టేసారని ఆయన ప్రకటించడంతో మైక్ లోనే ప్రకటన చేశారు. అయినా ఏం ఫలితం లేకుండా పోయింది.
టీ షర్ట్లు తెచ్చిన తంటా...
జగిత్యాల జిల్లా కేంద్రంలో సీఎం కప్ క్రీడలకు జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాలతోపాటు వేములవాడ చొప్పదండి నియోజకవర్గానికి  చెందిన కొన్ని మండలాల క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. అయితే జగిత్యాల నియోజకవర్గ క్రీడాకారులకు ఒకే రకమైన టీ షర్ట్స్ ఉండాలని భావించిన మెప్మా సిబ్బంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను సంప్రదించగా విద్యార్థులతో పాటు మెప్మా సిబ్బంది కూడా టీ షర్టులను కొనిచ్చారు. అయితే కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల క్రీడాకారులకు ఒకే రకమైన టీషర్ట్స్ లేకపోవడంతో వివిధ రకాల టీచర్లను ధరించి పాల్గొన్నారు. ఇది క్రీడ ప్రాంగణంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. దీంతో సమావేశం జరుగుతుండగానే మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  పి ఎలు  ఆయా నియోజకవర్గాల మెప్మా సిబ్బందిని ఆరా తీయగా జగిత్యాల ఎమ్మెల్యే కొనిచ్చారని మనం కొనలేదని చెప్పడంతో ఆగ్రహ వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇచ్చి ఉంటే తాముకూడా కొనిచ్చే వారమే కదా ఎందుకు ఈ నిర్లక్షం అని  సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయమం మంత్రి, కోరుట్ల ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావులు సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ విద్యార్థులకు క్రీడాకారులకు కూడా తాము రేపటి నుండి కొత్త టీషర్ట్స్ అందిస్తామని ప్రకటించారు. అందుకే ఇలాంటి తార తమ్యాలు రాకూడదనే పాటశాలల్లో విద్యార్థులకు ఓకే రకమైన యునిపాం వినియోగిస్తారు.