బల్దియాలో నిబంధనలకు తిలోదకాలు

బల్దియాలో నిబంధనలకు తిలోదకాలు
  • టెండర్ లేకుండానే రూ. 15 లక్షల పనులు కేటాయింపులు
  • వివాదాస్పదం అవుతున్న మున్సిపల్ అధికారుల తీరు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ అధికారులు నిబంధనలకు తిలోధాకాలు ఇచ్చి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారు తీసుకునే అకస్మాత్ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. తెలంగాణ ఆవిర్బావ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ 15 రోజుల క్రితం ప్రకటించగా మరుసటి రోజు నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఉత్సావాల నిర్వహణ, ఏర్పాట్లఫై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పలు సూచనలు, ఆదేశాలు జారి చేస్తూ వస్తున్నారు. అయితే జగిత్యాల మున్సిపల్ లో హడావుడిగా దశాబ్ధి ఉత్సావాలు ప్రారంభం కాబోయే రెండు రోజుల ముందే నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి టెండర్లు లేకుండానే రూ. 15 పనులను అధికారులు నామమాత్రంగా ఒకరికి అప్పగించారు. ఇందులో పట్టణంలోని ప్రధాన కూడాల్లతోపాటు మున్సిపల్ కార్యాలయం, క్లాక్ టవర్ కు విధ్యుతు సిరిసు బల్బులా ఏర్పాటుకు  రూ. 5 లక్షలు కేటాయించగా, ఎల్ ఇ డి ప్యానెల్ స్క్రీన్లు, సౌండ్ సిస్టం, ప్లెక్షిల ఏర్పాటుకు రూ. 5 లక్షలు,  టి షర్ట్ లు, క్యాప్స్ కొనుగోలు, త్రాగు నీరు, పండ్లు, ఇతర ఎనర్జీ డ్రింక్స్ కోసం మరో రూ. 5 లక్షలు కేటాయించారు.

నిబంధనల ప్రకారం మున్సిపల్ నుంచి రూ. 1 లక్షకు మించి ఎ పని అయిన టెండర్ ప్రక్రియ ద్వారానే కేటాయించాలి . టెండర్లు నిర్వహించినట్లు అయితే కాంట్రాక్టర్లు ఎక్కువ మంది పాల్గొని రూ. 15 లక్షల పనులకు లెస్ కోటు చేసే వారు దాంతో మున్సిపల్ కు  ఆదాయం సమకూరేది. ఇలా మున్సిపల్ ఆదాయానికి అధికారులు గండి కొట్టారు. వాస్తవానికి టెండర్లు పిలిచేందుకు సమయం ఉన్న టెండర్లు పిలవకుండా అధికారులు చేతివాటం చూపి నామమాత్రంగా కేటాయింపులు జరిపి కమిషన్లకు కక్కుర్తి పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల ఒత్తిడితోనే టెండర్లు పిలవకుండా కేటాయింపులు జరిపారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కరోనా సమయంలో కూడా టెంట్లు ఏర్పాటు కోసం టెండర్ పిలవకుండానే రూ. 6 లక్షల పనులు కేటాయించారు. ఆ బిల్లులను ఇప్పటికి మున్సిపల్ అధికారులు చెల్లించడంలేదు.. అయినప్పటికీ మల్లి అదే పంథాను అవలంబించడంఫై అధికారుల ద్వంద వైకరి అర్థం కావడం లేదు. వీటిఫై లోతుగా విచారణ జరిపి మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న అధికారుల ఫై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.