వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం

వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం
  • మున్సిపల్ ఛైర్మన్ లయన్ మోర హన్మండ్లు

ముద్ర, రాయికల్ :-రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ ఛైర్మన్ లయన్ మోర హన్మండ్లు అన్నారు.శుక్రవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే పట్టణంలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరంలో 156 మందికి కంటి పరీక్షలు చేయగా 40 మందికి కంటి  ఆపరేషన్ కోసం గుర్తించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు లయన్స్ క్లబ్ సుమారు 1385 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. భవిష్యత్తులో నిరుపేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కండ్లు దానం చేసిన కుటుంబ సభ్యులకు ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ హైదరాబాద్ వారు అందించిన ప్రశంస పత్రాలను దాత కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిసీలు మ్యాకల రమేష్, కాటిపెల్లి రాంరెడ్డి,చౌడారపు లక్ష్మీనారాయణ, అధ్యక్షులు ఎద్దండి దివాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శికొత్తపెళ్లి రంజిత్ కుమార్,కోశాధికారి కడకుంట్ల నరేష్,ఉపాధ్యక్షులుమచ్చ శేఖర్,లయన్స్ క్లబ్ సభ్యులుదాసరి గంగాధర్,గంట్యాల ప్రవీణ్, కట్ల నర్సయ్య,కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి, గ్రామీణ వైద్యులు సాగర్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.