ఇథనాల్ ఫ్యాక్టరీతో స్తంభంపల్లి గ్రామంలో చిచ్చు..

ఇథనాల్ ఫ్యాక్టరీతో స్తంభంపల్లి గ్రామంలో చిచ్చు..
  •  గ్రామ సభ తీర్మాణం పై భారి ఆందోళన
  •  గ్రామ ప్రజలను సంప్రదించకుండా తీర్మాణం ఎందుకు ఇచ్చారంటు పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజల నిరసన
  •  అభివృద్ధిని కాంక్షించే  తీర్మాణం ఇచ్చామన్న సర్పంచ్

 వెల్గటూర్, ముద్ర:  జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న  ఇథనాల్ ప్రాక్టరీ మండలంలోని స్థంభంపల్లి గ్రామంలో గల ప్రజల మధ్య చిచ్చు రేపుతుంది. గ్రామ ప్రజలను సంప్రదించకుండానే గ్రామ పాలక వర్గం ప్రాజెక్టు నిర్మాణం కోసం  తీర్మాణాన్ని ఏ విధంగా ఇచ్చారని గ్రామంలో గల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో గల అన్ని వీ ధులలో తిరిగి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలని నినాదాలు చేశారు. జగిత్యాల జిల్లా,  వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో 110 ఎకరాలలో 700 కోట్లతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని క్రిబ్ కో కంపెనీ చేపట్టింది.  దీని ద్వారా ఏటా ఎనిమిది కోట్ల లీటర్ల అయిల్ తయారు చేయ నుంది. దీని చదును కోసం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 13 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ మేరకు పనులు ప్రారంభం కావడంతో వాతావరణం, జల కా లుష్యాలతో పాటుగా పేదవారికి సెంట్ భూమి కూడా మిగుల కొండా పోతుందని ప్రాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్తంభంపల్లి  చుట్టుపక్కల గ్రామాలలో గల ప్రజలు భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతున్నారు.

బీసీ గురుకుల  పాఠశాల భవనంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు ఏవైనా నిర్మించి మా గ్రామాలలో ప్రశాంతతను కల్పించాలని కోరారు.  మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో  గ్రామ పాలకవర్గం ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందు కోసం  తీర్మాణాన్ని ఏ విధంగా ఇచ్చారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో  భారీ ఆందోళన చేపట్టారు. కాగా అక్కడికి సర్పంచ్ చల్లూరి రూపారాణి,రామ్ చందర్ గౌడ్ చేరుకొని గ్రామసభ తీర్మాణం అందజేసిన విషయం  పై  వివరణ ఇచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థంభంపల్లి గ్రామ అభివృద్ధికోసం నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధిని కాంక్షించే  గ్రామసభ తీర్మానాన్ని ఇవ్వడం జరిగినట్లు వివరించారు.

ప్రాక్టరీ వలన గ్రామానికి నష్టం జరుగుతుంది అంటే ప్రజల వెంట తాను ఉంటానని హామీ ఇచ్చారు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని తీర్మాణం ఇచ్చారటం నిజం కాదని, ఎటువంటి ప్రమాణాలు చేయడానికి అయినా సిద్ధమని తెలిపారు. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉన్న స్థంభంపల్లి గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రజల మధ్య మనస్పర్ధలను కలిగించి గొడవలు జరిగేందుకు కారణంగా మారుతున్నాయి. ఒక దశలో  స్థంభంపల్లిలో పరిస్థితి అదుపు తప్పింది. ధర్మపురి సిఐ కోటేశ్వర్, ఎస్ఐ నరేష్ అక్కడకు చేరుకొని ప్రజలకు నచ్చజెప్పి ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేశారు. అదే విధంగా మూడు రోజులుగా మండలంలోని పాసిగామా గ్రామంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పాశిగామలో బీ ఆర్ఎస్  పార్టీకి గ్రామ కార్యవర్గ సభ్యులు అందరు ముకుమ్మడిగా  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.