మల్యాలలో ఘనంగా పోచమ్మ బోనాలు... 

మల్యాలలో ఘనంగా పోచమ్మ బోనాలు... 

- మారు బోనం సమర్పించిన మహిళలు..
ముద్ర, మల్యాల: మల్యాలలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బోగోళ్ళ మర్రి ప్రాంతం నుంచి బీసీ కాలనీ వరకు చెందిన దాదాపు 300 కుటుంబాలు ముత్యంపేట శివారులోని పోచమ్మ తల్లి బోనాలు తీశారు. ఇక్కడ ఆలయం నిర్మించి, ఏడాది కావస్తుండడంతో , పోచమ్మ తల్లికి మారు బోనం సమర్పించారు. డప్పుచప్పుల్లతో పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని మహిళలు ఆలయానికి చేరుకున్నారు. యువకులు డీజె ఏర్పాటు చేసుకొని నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మిట్టపల్లి విమల, స్థానిక సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, నేరెళ్ల భూమారెడ్డి, ఎల్లాల జనార్దన్ రెడ్డి, మిట్టపల్లి దశరథం, బాసోజీ గోవర్ధన్, వేముల సంతోష్, భోగ రాజు, దూస దేవరాజం, తదితరులు పాల్గొన్నారు.

 పోచమ్మ గుడి నిర్మాణానికి 5 లక్షలు
మల్యాలలోని కొత్తపేట సమీపంలో నిర్మించనున్న పోచమ్మ ఆలయానికి 5 లక్షలు ఎమ్మెల్యే నిధులు మంజూరు, మరి కొన్ని విరాళంగా అందజేయనున్నట్లు ఎంపీపీ మిట్టపల్లి విమల, సర్పంచ్ సుదర్శన్ లు హామీ ఇచ్చారు. పోచమ్మ బోనాల సందర్బంగా హాజరైన వారు మాట్లాడుతూ మల్యాలలో దాదాపు అన్ని ఆలయాలకు తమ కుటుంబం తరుపున సహాయసహకారాలు అందిస్తున్నామన్నారు.