చెరువుల అభివృద్దికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

చెరువుల అభివృద్దికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని అన్ని చెరువులను మిషన్ కాకతీయ లో భాగంగా అభివృద్ధి చేసుకున్నామని, చెరువుల అబివృద్దికి ప్రబుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. పట్టణ శివారును అనుకోని ఉన్న  జగిత్యాల రూరల్ మండల కండ్ల పల్లి చెరువు కట్టను రూ. 43 లక్షల తో చేపట్టనున్నమరమ్మత్తు పనుల కోసం ఎమ్మెల్యే  శంకుస్థాపన చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాష్ట్రంలో మరియు జగిత్యాల నియోజకవర్గం లో అన్ని చెరువులు జలకలను సంతరించుకున్నాయన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, సర్పంచ్ లు రజిత శేకర్, తిరుపతి, ఎంపీటీసీ సౌజన్య తిరుపతి, కౌన్సిలర్ లు ఆసియా సుల్తానా, మళ్ళీ కార్జున్,పంబాల్ రామ్ కుమార్, కూతురు రాజేష్, జిల్లా రైతు బందు సమితి సభ్యులు దామోదర్ రావు,  ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, నాయకులు డిష్ జగన్, కూతురు శేకర్, దయాల మల్లారెడ్డి, ఎఫ్ సిఎస్  ఛైర్మెన్ గుమ్ముల అంజయ్య, రాజన్న, శంకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.