అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఈత తాటి వనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్

అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఈత తాటి వనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామంలో మూడురోజుల క్రితం అగ్ని ప్రమాదం లో దగ్దం అయిన ఈత, తాటి వనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ నిధుల నుండి రెండు బోర్ మోటార్ లు నిదులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో

గౌడ సంఘం భవన నిర్మాణానికి 4 లక్షల ప్రొసీడింగ్స్ కాపీని అందజేశారు. వారి 

వెంట గ్రామ,మండల నాయకులు,గౌడ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.