బలవంతపూర్ లో ఇద్దరికి కత్తిపోట్లు

బలవంతపూర్ లో ఇద్దరికి కత్తిపోట్లు

ముద్ర, మల్యాల: మండలంలోని బల్వoతపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఇరువురు అన్నదమ్ములపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక ఎస్ ఐ చిరంజీవి కథనం మేరకు గ్రామానికి చెందిన రెవిన్యూ సహాయకుడిగా పనిచేస్తున్న దస్తగిరి, అతని సోదరుడి మౌలానాపై ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి, కత్తులతో దాడికి పాల్పడ్డారు.

స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని, వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వారిలో ఒకరు ఇదే గ్రామానికి చెందిన హరీష్ కాగా, మరో ఇద్దరిని గుర్తించల్సి ఉందనీ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు  ఎస్ ఐ తెలిపారు.