జగిత్యాలలో నేల కూల్చుతున్న వందల ఏళ్ళ  చెట్లు..

జగిత్యాలలో నేల కూల్చుతున్న వందల ఏళ్ళ  చెట్లు..

హరితహారంలో దేశంలోనే తెలంగాణ నెం 1 స్థానంలో ఉంటె జగిత్యాలలో మాత్రం ఏళ్ళ చరిత్రగల చెట్లను కూకటి వేళ్ళతో తొలగిస్తున్నారు . సీఎం సారు జర చుడండి అంటున్నాయి అలనాటి  చెట్లు ..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మనం చదువుకున్న చరిత్ర పుస్తకాలను తిరిగివేస్తే అశోకుడు రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటించెను అని ఇలా  ఎన్నో రాజుల పేర్లు చదివాం... శాస్త్రీయంగా చూసినట్లు అయితే భూమి ఫైన 33 శాతం చెట్లు, అడవులు ఉండాలి కానీ మనం అడవులు, చెట్లు నరికి వేయడంతో వాతావరణ సమతుల్యత లోపించి వాతావరణంలో మార్పులు సంబవిస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవడం, ఎండలు పెరిగి ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం, గాలిలో కాలుష్యం పెరిగి ఆక్సిజన్ శాతం తగ్గడం, ఓజోన్ పొర కొంచెం కొంచెం నశిస్తు రావడం లాంటి దుష్పరిమనాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలనే ఆయా ప్రభుత్వాలు హరితహారం ఫై ద్రుష్టి పెట్టి మొక్కలు నాటి వనాలను పెంచుతున్నారు. రాష్ట్రంలో మొక్కలు,  చెట్లు 33 శాతానికి పెంచాలని  హరితహారం ఫై తెలంగాణ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కల నాటి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకుగాను తెలంగాణ ప్రభుత్వం 7,213 పాయింట్లు సాధించి  హరిత హారంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.   6593 తో రెండవ స్థానంలో గుజరాత్ రెండవ స్థానంలో నిలిచాయి.

హరితంలో 13 శాతం లోటులో జగిత్యాల జిల్లా 
సియం కేసిఆర్ అడువుల శాతం పెరగాలని హరితహారంలో మొక్కలు నాటి వనాలు పెంచుతుంటే జగిత్యాలలో మాత్రం వందల ఏళ్ళ నాటి నీడను, ప్రాణవాయువును ఇచ్చే చెట్లను నరికి కూకటివేళ్ళతో పెకలించి వేస్తున్నారు. వందల ఏళ్ళ క్రితం ఇప్పుడున్నంత రవాణా సౌకర్యాలు అప్పుడు లేవు. అప్పట్లో ఎడ్ల బండ్లఫై ప్రయాణం చేసేవారు. వారికి, ఎడ్లకు అలసట వస్తే రోడ్డు పక్కనే ఉన్న చెట్ల నీడలో కొంత సేపు సేదతీరి ప్రయాణం సాగించే వారు. అంతే కాకుండా అప్పుడు రోడ్ల వెంట పళ్ళను ఇచ్చే మామిడి, అల్లానేరేడ్ చెట్లతో పాటు వేప చెట్లను ఎక్కువగా పెంచే వారు . అవి యాత్రికులకు ఫలాలతో పాటు, నిత్యం ప్రాణవాయువును అందించేవి. అడువుల శాతం 33 ఉండాల్సి ఉండగా  జగిత్యాల జిల్లాలో 20 శాతంమే ఉంది . ఇంకా 13 శాతం చెట్లను పెచాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఉన్న చెట్లను కాపాడుకుంటూ పోవాల్సింది పోయి , నిజాం కాలంలో నాటిన వందల ఏళ్ళ చెట్లను కొట్టి వేస్తున్నారు. రోడ్దు వెడల్పు కార్యక్రమంలో బాగంగా తోలిగిస్తున్నమంటున్న అధికారులు జగిత్యాల చుట్టూ పెద్ద ఎత్తున బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ధర్మపురి నుంచి పొలస, తిమ్మాపూర్, మోతే, వెల్దుర్తి,నర్సింగాపూర్ ధరూర్ కెనాల్ వరకు అలాగే కరీంనగర్ రోడు నుంచి ధరూర్ కెనాల్ అంతర్గాం మీదుగా నిజామబాద్ రోడు లోని చలిగల్ వరకు, అలగే ధర్మపురి రోడు నుంచి తిప్పన్న పేట మీదుగా చలిగల్ వరకు ఇలా జగిత్యాల పట్టణం చుట్టూ రింగ్ రోడ్ వేస్తున్నారు. జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్ వేస్తుండగా  మళ్ళి పెద్దగానే ఉన్న నిజామబాద్ రోడును ఇంకా పెంచి వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద చెట్లను తొలగించి పర్యావరణాన్ని కలుషితం చేయవద్దని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం మొక్కలు నాటిన అవి వీటిల నీడనిచ్చేవి కావని, అయిన అవి ఎదగాలంటే మల్లి ఎన్నో ఏళ్ళు వేచి చూడాలని అంటున్నారు. వందల ఏళ్ళ నాటి చెట్ల తొలగింపు నిలిపి వేయాలని, స్థానికులు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.