తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర: తెలంగాణ రాష్ట్రం లోని పల్లెలు దేశానికే ఆదర్శం అని. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి చెందాయని.పచ్చదనం పరిశుభ్రత తో ఆహ్లాదాన్ని  పంచుతున్నాయని అన్నారు. అనంతరం మండలానికి చెందిన 60 మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఆర్డీవో వినోద్ కుమార్,  ఎంపీపీ కాటిపెళ్లి సరోజన ఆది రెడ్డి, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగేష్, ఎంపిటిసి రామ్ రెడ్డి, సర్పంచ్ గోవింద నాయక్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు..