థాంక్యూ హరీష్ రావు... సిద్దిపేట ను చాలా బాగా చేశావు

థాంక్యూ హరీష్ రావు... సిద్దిపేట ను చాలా బాగా చేశావు

హరీష్ రావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించిన ఐటీ,మున్సిపల్ మంత్రి కేటీఆర్

ముద్ర  ప్రతినిధి, సిద్దిపేట :

థాంక్యూ హరీష్ రావు సిద్దిపేట బాగా చేశావు గుడ్ వర్క్స్ కనిపిస్తున్నాయి అంటూ మంత్రి తన్నీరు హరీష్ రావును ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు హరీష్ రావుకు ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు.

గురువారం నాడు సిద్దిపేట పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ హరీష్ రావులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా స్వచ్ఛబడిలో జరిగిన మున్సిపల్ కార్యక్రమాలను పి పి టి ద్వారా మంత్రులకు చూపించారు ఈ సందర్భంగా సిద్దిపేటలో జరుగుతున్న తడి పొడి హానికర చెత్త చెత్తల వినియోగం పైన పట్టణంలో స్టీల్ బ్యాంకుల నిర్వహణ పైన రుతు ప్రేమ స్వచ్ఛబడి నిర్వహణలపై పిపిటి ద్వారా తిలకించిన మంత్రులు ఎంత మంచి కార్యక్రమాలు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు సేవలను ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు.