తెలంగాణ గొప్ప కళాకారున్ని కోల్పోయింది

తెలంగాణ గొప్ప కళాకారున్ని కోల్పోయింది
  • సాయిచంద్ అకాల మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:- సాయిచంద్ పాటలు, మాటలు నా చెవుల్లో ఇంకామారు మ్రోగుతున్నాయి. సాయి నవ్వు,అన్న అంటూ పలకరించే ఆప్యాయత ఎప్పటికి మరిచిపోలేను.

ఉద్యమ గళం మూగబోయింది..

మరో ఉద్యమ కెరటం నేల రాలింది. అంటూ మెదక్ పార్లమెంట్ సభ్యుడు,భారత రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం తెలిపారు.పొద్దున్నే ఇంత దుర్వార్త వినాల్సి వస్తుంది అనుకోలే.తన గొంతుతో తెలంగాణ స్వరాన్ని వుర్రుతలుగించిన తెలంగాణ గానం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడుసాయిచంద్ గుండెపోటుతో మరణించడం తెలంగాణ కు,బీఆర్ఎస్ కు తీరని లోటని ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.రెండు మాసాల క్రితం దుబ్బాకలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో సాయి వినిపించిన పాటలు నేటికీ నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయన్నారు.ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా బీఆర్ఎస్ కు తన ఆటపాటల ద్వారా ఎనలేని సేవలందించారన్నారు.ఎంతో భవిష్యత్తు ఉన్న సాయి కాలమరణం కలిచివేసిందన్నారు.సాయిచందును మన నుండి బౌతికంగా దూరం చేసినా ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో సాదించిన కీర్తి శాశ్వతం.అజరామరంగా నిలిచిపోతుందన్నారు.సాయి చెందు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణికోరుకుంటూఆశ్రునివాలిఅర్పించారు