గంగాపూర్, మాచాపూర్ మిర్చి మార్కెట్ అవకతవకలపై కు ఫిర్యాదు

గంగాపూర్, మాచాపూర్ మిర్చి మార్కెట్ అవకతవకలపై కు ఫిర్యాదు

సిద్దిపేట ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్, మాచపూర్లో నిర్వహించే మిర్చి మార్కెట్ లో కొంతమంది వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా ఎజెంట్లు సిండికేట్ గా ఏర్పడి వాళ్ళ ఇష్టఅనుసరంగా ధర నిర్ణహిoచుకుంటూ,  తక్కువ ధరలు రైతులకు చెల్లిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టరేట్ ఏవో కు డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్కు పలువురు మిర్చి రైతులతో కలిసి వచ్చి నాగరాజు కలెక్టరేవోకు వినతి పత్రం చేశారు
రైతుల నుండి మిర్చి కొనుగోలు చేసిన ఏజెంట్ 20  రోజులైనా డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురించేస్తు, ఇదేమని ప్రశ్నిస్తే మీ మిర్చి కొనమని, ఎవరికి చెప్పుకుంటావో,ఏం చేసుకుంటావో చేసుకోండి అని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారన్నారు.అంతే కాకుండా గతం లో ఏజెంట్ గా వున్నా వ్యక్తి రైతుల వద్ద మిర్చి కొని లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడని దీనివల్ల  రైతులు సుమారు 30 లక్షల వరకు మోసపోయారని దీనిపై ఇప్పటి .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంధబోయిన పర్శరాములు, రైతులు  రాజు,నాగరాజు,ఎల్లయ్య, అజయ్ రాజమల్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు