బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ బలగాన్ని చాటేందుకే ఆత్మీయ సమ్మేళనం

బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ బలగాన్ని చాటేందుకే ఆత్మీయ సమ్మేళనం

 ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బి ఆర్ ఎస్ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు కుటుంబ బలాన్ని, బలగాన్ని చాటేందుకేనని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజవర్గం,పెంబి మండల కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అన్ని పథకాలూ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్ కు తప్ప ఇతరపార్టీలకు లేదన్నారు. బీజేపీ నాయకులు దొంగే  దొంగ దొంగ అని అరుస్తున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు.తప్పుడు కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.అనంతరం కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించి  వారి తో కొంత సమయం గడిపారు.ఈ కార్యక్రమంలో పెంబి మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పలువురు సర్పంచ్ లు,ఎంపీటీసీలు గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు.