అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా

అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అంగన్వాడీలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ లేబర్ కోడ్ రద్దు చేయాలని, ఐ సి డి ఎస్ కు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.