ప్రాథమిక వైద్య పరిజ్ఞానం అందరికీ ఆవశ్యం - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రాథమిక వైద్య పరిజ్ఞానం అందరికీ ఆవశ్యం - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి కాలంలో హఠాన్మరణాలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక చికిత్స విధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ అంబేద్కర్ భవనంలో వివిధ శాఖల ఉద్యోగులకు సి పి ఆర్ విధానంపై వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ చాలా సందర్భాల్లో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ మధ్య గుండె పోటు ఫలితంగా ఎందరో మృతి చెందారని, ప్రాథమికంగా సి పి ఆర్ అందించటం వల్ల కొందరికి ప్రాణాలు నిలబడ్డాయన్నారు.వైద్య శాఖ వారు ఈ విధానంపై అవగాహనా సదస్సు ఏర్పరచడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి,ఆశ కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.