కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ వర్ధంతిని అధికారికంగా జరపాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ వర్ధంతిని అధికారికంగా జరపాలి
  • నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
  • మెదక్ జిల్లా అధ్యక్షులు ఆశరాజు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్బంగా ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్  జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఆశరాజు, దినకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ రాజు, దినకర్ మాట్లాడుతూ భగత్ సింగ్ వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశం కోసం 23 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ భారత రత్న గౌరవాన్ని కల్పిస్తూ భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, అదేవిధంగా దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ అమలు చేయాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేస్తూ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్పొరేట్ కబంధహస్తాల్లో నలిగిపోతున్న విద్యార్థులను ఒత్తిడి చదువుల నుండి దూరం చేయాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపయ్య, నందు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు