దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
An undeclared emergency in the country
  • బిజెపి ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ ధ్వజం
  • మెదక్ జిల్లాకు చేరిన సీపీఎం జనచైతన్య యాత్ర

ముద్ర ప్రతినిధి, మెదక్: దేశంలో బిజెపి ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ విదిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం హాస్యాస్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర శనివారం మెదక్ చేరుకుంది  ఈ సందర్భంగా మార్కెట్ యాడ్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని కూని  చేసేలా మోడీ సర్కారు పనిచేస్తుందని విమర్శించారు.

ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని నిర్ములించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన వాగ్దానాలు మోడీ అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగాలు ఉడదీశారని ఆరోపించారు. రైతులకు సున్నా వడ్డీపై రూ. లక్ష లోన్ ఇస్తామని మోసం చేశారన్నారు. కార్మిక చట్టాలను నిర్విర్యం చేశారని పేర్కొన్నారు.