సిపిఎస్ ను రద్దుకు బైక్ ర్యాలీ, ధర్నా

సిపిఎస్ ను రద్దుకు బైక్ ర్యాలీ, ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు యుఎస్పీసీ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు  మెదక్ జిల్లా కేoద్రంలో బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సంగయ్య మాట్లాడుతూ
సిపిఎస్ రద్దు చేసి, ఒపిఎస్ అమలుచేయాలన్నారు.

జూలై 1 నుంచి ఐఆర్ ప్రకటించి, నిర్దిష్ట కాల పరిమితితో పిఆర్సి కమిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 317 జి.ఓ.బాధితులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రు. 398 స్పెషల్ టీచర్ సర్వీసుకు నోషనల్ ఇంక్రిమెంట్ లు ఇవ్వాలన్నారు.

టీచర్ల పదోన్నతులు, బదిలీలు, నియామకాలు చేపట్టాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయున్ని కేటాయించాలన్నారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... పండిట్, పిఐటీల అప్గ్రేడేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిఎం హామీ మేరకు 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలన్నారు. అన్ని పాఠశాలలకు మనఊరు- మనబడి వర్తింపజేయాలని, పథకానికి నిధులు కేటాయించి సత్వరమే మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మా రావు మాట్లాడుతూ నగదు రహిత అపరిమిత ఆరోగ్య పథకాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు యాదగిరి, ఉపాద్యాయ దర్శిని ఎడిటర్ శశిధర్ రెడ్డి, నాయకులు భీంలా నాయక్, రవీందర్ రెడ్డి, పిండి నాగరాజు, సురేందర్ నాగుల్ మీరా,శేకర్,యాదగిరి,గోపాల్, రాజయ్య, దేవీ సింగ్, హీరా లాల్, శ్రీనివాస్ రెడ్డి, కొమ్మ శ్రీనివాస్, శీతల సింగ్,శేఖర్, ప్రేమ్ కుమార్, బాల పోచయ్య, నరసింహా రావు, సత్య నారాయణ తదతరులు పాల్గోన్నారు