నిబంధనలు సవరించాలి- మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కమీషనర్ కు లేఖ

నిబంధనలు సవరించాలి- మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కమీషనర్ కు లేఖ

ముద్ర ప్రతినిధి, మెదక్: వరి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని అనుమతించిన రైస్ మిల్లు వద్దకు ధాన్యం పంపించాలని నిబంధనలు పెట్టడం సరికాదని, సవరించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
సివిల్ సప్లయి కమీషనర్ అనిల్ కుమార్ కు  డిమాండ్ చేశారు.  మంగళవారం ఈమేరకు లేఖ రాశారు. పరిమితమైన రైస్ మిల్లులు ఇవ్వడంతో లారీలు ఖాళీ కావడానికి రెండు, మూడు రోజులు పడుతుందన్నారు. దీంతో కేంద్రాల నుండి ధాన్యం త్వరగా వెళ్లదన్నారు. గతం లాగే జిల్లాలోని ఏ బాయిల్డ్ రైస్ మిల్ కైనా పంపడానికి అనుమతులు ఇవ్వాలన్నారు. ధాన్యం పంపిన వెంటనే రైస్ మిల్ కోడును కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేస్తూ టాప్ లో ఎంట్రీ చేయాలన్నారు. ధాన్యం ఒకరోజులో లారీలు ఖాళీ అయ్యే విధంగా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద తూకం వేసిన వరి ధాన్యానికి, రైస్ మిల్ వద్ద తూకం చేసిన ధాన్యానికి వ్యత్యాసం వస్తుందన్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు.

రైస్ మిల్ వద్ద ఉన్న తూకం మెషిన్ లు అధికారులు తనిఖీలు నిర్వహించి వాటిని సరి చేయాలన్నారు.