క్రషర్  ముసివేయాలి మైనింగ్ ఎడికి ఫిర్యాదు

క్రషర్  ముసివేయాలి మైనింగ్ ఎడికి ఫిర్యాదు

తూప్రాన్, ముద్ర: ప్రజలు, రైతులకు అన్నిరకాల నష్టం కలిగిస్తున్న విజయలక్ష్మి క్రషర్, బ్లాస్టింగ్ ను ముసివేయాలని గురువారం తూప్రాన్ పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ మైనింగ్ ఏడి జయరాజ్ కు పిర్యాదు చేశారు. తూప్రాన్ మండలంలోని ఘనపూర్ గ్రామ పరిధిలోగల విజయలక్ష్మి క్రషర్ అక్రమ బ్లాస్టింగ్ పేలుళ్ల వల్ల చుట్టుపక్కల గ్రామాలైన దమ్మక్కపల్లి,వెంకటాపూర్, ధర్మరాజ్ పల్లి, ఇమాంపూర్ తదితర గ్రామాల రైతుల పంట పొలాల బోర్లు చెడిపోతున్నాయని, పంట చేన్లు పాడవుతున్నాయని అయా గ్రామాలలో నివాసలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. అదేవిదంగా పేలుళ్ల వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, శబ్దం, దుమ్ము వల్ల వినికిడి, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత క్రషర్ పై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో అయా గ్రామాల రైతులు, ప్రజలతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. పిర్యాదు చేసినవారిలో తూప్రాన్ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్, నాయకులు చంద్రశేఖర్, నందు తదితరులు ఉన్నారు.